అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలపై కఠిన చర్యలు తీసుకోవాలనే ప్రతిపాదనను బలంగా సమర్థించారు. రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేసి, దాన్ని తిరిగి ప్రపంచ మార్కెట్లో విక్రయిస్తున్న దేశాలపై ఏకంగా 500 శాతం వరకు భారీ సుంకాలను విధిస్తామని ఆయన స్పష్టం చేశారు.