నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక తీరానికి సమీపంలో శనివారం రోజున ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) ప్రకటించింది.

జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ శివారు ప్రాంతంలో ఉన్న నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో మొత్తం 9 మంది మృతి చెందగా, 32 మంది గాయపడ్డారని జమ్మూకశ్మీర్ డీజీపీ నళిన్ ప్రభాత్ వెల్లడించారు.
శబరిమల మండల-మకరవిళక్కు సీజన్ అధికారికంగా ప్రారంభమైంది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు అయ్యప్ప ఆలయ తలుపులు తెరుచుకోనున్నాయి. వృశ్చిక మాసం ఆరంభంతో ప్రారంభమయ్యే ఈ యాత్రకు భక్తులను సోమవారం తెల్లవారుజామున 3 గంటల తర్వాత దర్శనానికి అనుమతిస్తారు. అయితే, ఈ ఏడాది కేవలం ఆధ్యాత్మికంగానే కాక, ఆరోగ్య పరంగా కూడా భక్తులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఢిల్లీలోని ప్రముఖ చారిత్రక కట్టడం ఎర్రకోట (Red Fort) పరిసరాల్లో సంభవించిన బాంబు పేలుడు ఘటనపై దర్యాప్తు వేగవంతమైంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో, భద్రతా, దర్యాప్తు సంస్థల వర్గాలు తాజాగా కొన్ని ముఖ్యమైన విషయాలను వెల్లడించాయి.